BREAKING
48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం

మదనపల్లి న్యూ తాజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం : యజమాని పఠాన్ ఖాదర్ ఖాన్‌కు యోగేశ్వర్ బాబు పరామర్శ

Select Suryaa Now
మదనపల్లి న్యూ తాజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం : యజమాని పఠాన్ ఖాదర్ ఖాన్‌కు యోగేశ్వర్ బాబు పరామర్శ

మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన,మదనపల్లె పట్టణం,బెంగళూరు బస్టాండ్ వద్ద ఉన్న న్యూ తాజ్ హోటల్‌లో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.ఈ ప్రమాదంలో హోటల్‌లోని ఫర్నిచర్,వంట పాత్రలు,ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి.ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు సోదరుడు దివ్యశ్రీ సిల్క్స్ ఎండీ గుండ్లపల్లి యోగేశ్వర్ బాబు,టౌన్ ప్రెసిడెంట్ అరుణ్ తేజ్,46వ వార్డు కౌన్సిలర్ ప్రభు గౌడ్,ప్రణయ్ గురువారం న్యూ తాజ్ హోటల్‌ను సందర్శించారు.అగ్నిప్రమాదం జరిగిన తీరును పరిశీలించి,హోటల్ యజమాని రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్,టిడిపి పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ పఠాన్ ఖాదర్ ఖాన్‌ను పరామర్శించారు.ఈ సందర్భంగా ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టంపై వివరాలు అడిగి తెలుసుకుని,బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.ఇలాంటి విపత్కర సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.కాగా ప్రమాద సమాచారం అందిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి