డ్రాప్స్ లేకుండా కృషి చేయండి --- విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ చింతాల వెంకట్రావు
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : ఏ ఒక్కరూ విద్యను మధ్యలో ఆపివేయరాదని ప్రతి ఒక్కరు చదివే విధంగా స్కూల్ కి వచ్చే విధంగా స్కూల్ కమిటీ సభ్యులు కృషి చేయాలని విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ చింతల వెంకటరావు అన్నారు. గురువారం వీఆర్ మున్సిపల్ హై స్కూల్ స్కూల్ కమిటీ సమావేశం ప్రిన్సిపాల్ ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకట్రావు మాట్లాడుతూ వి ఆర్ హై స్కూల్ అభివృద్ధికి మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని తెలిపారు. వి ఆర్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే క్రమశిక్షణతో పాటు ఉత్తమ విద్యాభోధన అందిస్తున్నామన్నారు. వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, పీఈటి గురు ప్రసాద్ ఇతర ఉపాధ్యాయులు పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు స్కూల్లో అవసరమైన వసతులు కల్పించడం, ప్రతి విద్యార్థి పై పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్కూల్ కమిటీ సభ్యులు స్కూల్ అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ ఎల్ లక్ష్మీనారాయణ, పీఈటి గురు ప్రసాద్, వి ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ జయలక్ష్మి, కమిటీ చైర్మన్ రాము, వైస్ చైర్మన్ ఎస్ డి. రీనా, కమిటీ సభ్యులు సయ్యద్ మహమ్మద్ రఫీ,కె. మంజీరా,వి సుజాత, ఆర్ మాధవి, సయ్యద్ సవిరుద్దీన్, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు.