పొన్నూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత...... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
పొన్నూరు మేజర్ న్యూస్:-పొన్నూరు పట్టణంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో పట్టణంలో 2వార్డు మరియు 27 వార్డులలో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న పార్కులను పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డెయిరీ చైర్మన్ శ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా పార్కుల్లో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం, చిన్నారులకు ఆటవిడుపు, వృద్ధులకు సేదతీరే అవకాశం కల్పించడం, పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించడం లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.పొన్నూరు పట్టణాన్ని మరింత సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పొన్నూరు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్