అండర్-19 ఆసియాకప్ ఫైనల్‌కు భారత్..
దుబాయ్: అండర్-19 ఆసియాకప్‌లో భారత యువ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. సెమీఫైనల్ పోరులో ఆఫ్ఘనిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆఫ్ఘన్ బ్యాటర్లు భారీ స్కోరు చేయలేకపోయారు. అనంతరం 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ఆఫ్ఘన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కేవలం 36.5 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 230 పరుగులు చేసి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ విజయంతో అండర్-19 ఆసియాకప్ టైటిల్ పోరుకు భారత్ అర్హత సాధించింది. ఎల్లుండి (నవంబర్ 14) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.