BREAKING
ఏఐ క్లౌడ్ కంపెనీ నెబియస్ సంచలనం నిందితుడి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు మెక్సికోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక ఏఐ సెంటిమెంట్‌కు గండి, పడిపోయిన చమురు మరియు బంగారం ధరలు విద్యార్థుల మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మహిళా క్రికెట్‌లో రాణించి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి.. ఆర్‌డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి.. అనంతలో ముగిసిన ఆర్‌డీటీ మహిళా క్రికెట్ ప్రతిభాన్వేషణ రెండో విడత ఎంపికలు హంగేరీలో గర్భసొత్తిన మార్పులు మరియు వివాదాస్పద చట్టం రద్దు పెండింగ్ మున్సిపాలిటీ ల్లో ఎన్నికలు చల్ల రాజా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి జన్మదిన వేడుకలు ఇంటర్మీడియట్ విద్యా విధాన విలీన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి: బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్ వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలి - టీజీ ఎన్పీడీసియల్ సిఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌పై అమెరికన్ క్యాన్సర్ సొసైటీ కొత్త మార్గదర్శకాలు చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ ఉచ్చు భువనేశ్వర ప్రసాద్ రేపటి నుంచే 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా గ్రామంలోకి బస్సు రావాలని గ్రామస్తుల ఆధ్వర్యంలో సర్పంచ్ ధర్న

స్వచ్ఛమైన ఓటరు జాబితాతోనే బలమైన ప్రజాస్వామ్యం

Select Suryaa Now
స్వచ్ఛమైన ఓటరు జాబితాతోనే బలమైన ప్రజాస్వామ్యం

                                       విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన

కొత్తపేట,మేజర్ న్యూస్:ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు స్వచ్ఛమైన ఓటరు జాబితా ఎంతో కీలకమని కొత్తపేట వికెవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పి.రాజు అన్నారు.ఎన్నికల ప్రక్రియ,ఓటు హక్కు ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గురువారం కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నవంబర్ 2 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో నిర్వహిస్తున్న ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు.ఇందులో భాగంగా మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు 'స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రాముఖ్యత' అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు.అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు 'ఎన్నికల ప్రక్రియ' అంశంపై క్విజ్ పోటీలు నిర్వహించగా 50 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్ర,ఓటరు జాబితా ప్రాముఖ్యత,ఓటు హక్కు వినియోగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు.ముఖ్యంగా యువత ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన పెంపొందించుకుని ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులను నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే తదుపరి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.ఈ కార్యక్రమాల్లో కళాశాల అధ్యాపకులు,ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ సభ్యులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.