BREAKING
రాష్ట్రంలో ‘సెక్యూరిటీ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్’: హోం మంత్రి అనిత వెల్లడి జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అసత్య ప్రచారాలు ఆపండి, మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం శాసనమండలి మాజీ విప్ గంగుల సమక్షంలో వైకాపాలో చేరిక ఎన్నికల నియమావళి ని ఖచ్చితంగా పాటించాలి - డి ఎల్ డి వో రమణయ్య కలెక్టరేట్‌ గ్రంథాలయానికి రెండో రోజు పుస్తకాల విరాళం ఇక తెలంగాణలో భారత్ విస్తార్ సేవలు కొత్త హంగులతో ముస్తాబవుతున్న నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్! మాచర్ల : శనివారం రిజిస్ట్రేషన్ సేవలు యధాతధం స్థలం విషయంలో మహిళపై దాడి చిన్నారుల్లో న్యుమోనియా నిర్మూలనకు ప్రచారం - నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి 28 వరకు విద్యార్థులకు ప్యాడ్లు, నోటుపుస్తకాలు పంపిణీ గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.

నా ఓటమికి సొంత పార్టీ నాయకులే కారకులు

Select Suryaa Now
నా ఓటమికి సొంత పార్టీ నాయకులే కారకులు

 

 

 వేల్కూరు ఎంపీటీసీ వైకాపా అభ్యర్థి వర్ష ఆరోపణ

 వెన్నుపోటు పొడిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్ : ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ఓటమికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులే కారణమని గంగాధర నెల్లూరు నియోజకవర్గం వేల్కూరు ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వర్ష ఆరోపించారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు సొంత పార్టీ నాయకుల నుంచే సహకారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) జిల్లా కార్యాలయంలో వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో వర్ష మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని పదవులు అనుభవించిన కొందరు నాయకులు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవకుండా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ముఖ్యంగా గంగాధరనెల్లూరు మండలం వేల్కూరుకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు బాబురెడ్డి తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. సాక్షాత్తు రాష్ట్ర మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామితో కలిసి తాను ఐదు రోజులు బాబురెడ్డి నివాసానికి వెళ్లి ఎన్నికల్లో తన సహకరించాలని కోరినా ఆయన ససేమిరా అంటూ టిడిపికి మద్దతు పలికారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో కుమ్మక్కై, సొంత పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తనకు ఎన్నికల్లో ఏమాత్రం సహకరించలేదని పేర్కొన్నారు. తొలుత తన నామినేషన్ ను టిడిపి వర్గీయులు చింపివేసినా అధైర్య పడకుండా, వారికి ఎదురొడ్డి నామినేషన్ వేయగలిగానన్నారు. అదే పంథాలో పయనిస్తూ ఎన్నికల బరిలో నుంచి 238 ఓట్లతో తన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యానన్నారు. ఎన్నికలు జరిగిన రోజు సైతం బాబురెడ్డి తన నివాసంలోనే పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేసి ఓటర్లను ప్రలోభపెట్టి టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేయాలని ప్రచారం చేసినట్లు ఆరోపించారు. 144 సెక్షన్ ను సైతం ఖాతరు చేయకుండా పోలింగ్ స్టేషన్ కు 100 మీటర్ల లోపలికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని బాబురెడ్డి చెప్పడం దారుణమన్నారు. పార్టీకి నష్టం కలిగిస్తూ, ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యే నాయకుల వ్యవహారాన్ని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు, జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటేగౌడ దృష్టికి తీసుకెళ్లేందుకే మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకులపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధిష్ఠానాన్ని వర్ష డిమాండ్ చేశారు. కాగా ఈ సమావేశంలో వైసిపి నాయకులు సుధీర్ రెడ్డి, వేల్కూరు కుట్టి, ఎంపీటీసీ మాజీ సభ్యులు జయరామ్, సుధాకర్, ఏలుమలై, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.

 

 

ఫోటో. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వేల్కూరు ఎంపీటీసీ వైకాపా అభ్యర్థి వర్ష ఇతర వైకాపా నాయకులు.