మంచాల గదబూరు గ్రామానికి చెందిన 20 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు
మేజర్ న్యూస్ విమాడుగుల
తెలుగుదేశం పార్టీ ఆచరిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, దశ, దిశ ,నిర్దేశకులు వారు తమకు సూచనలను అనుసరించి తమ కుటుంబాలతో సహా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్నట్లు చీడికాడ మండలం మంచాల గదబూరు గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు మూకుమ్మడిగా తెలియ చేశారు. బుధవారం మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామానాయుడు, జడ్పిటిసి అభ్యర్థి కురచా రమేష్ సారధ్యంలో, స్థానిక శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి సమక్షంలో పార్టీ సభ్యత్వాన్ని వారు తీసుకున్నారు. పార్టీ కండువాను వారికి కప్పి సాదరంగా ఆహ్వానిస్తూ రాబోవు ఎన్నికలలో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి వారిని కోరారు. అదృష్టం కలిసి వస్తే ఆకులో తేనె పట్టు పట్టినట్టు జిల్లా ప్రాదేశిక సభ్యునిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న చీడికాడ మండలం అప్పల రాజపురం గ్రామానికి చెందిన కురచా రమేష్ గెలుపు దాదాపు ఖాయమైనట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు