BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన కార్యక్రమం

నెల్లూరు కల్చరల్, మేజర్ న్యూస్  :  నవంబర్ 14 శనివారం ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ విజయ కుమార్ మాట్లాడుతూ మధుమేహ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇన్సులిన్‌ను కనుగొనడంలో విశేష కృషి చేసిన ఫ్రెడరిక్ బాంటింగ్ సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. మన శరీరంలోని క్లోమగ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ విజయ కుమార్ వివరించారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  మధుమేహ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మధుమేహ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మధుమేహ రోగులకు ఉపయోగపడే ప్రత్యేక డైట్ షీట్‌ను ఆవిష్కరించి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ డైట్ షీట్ రూపకల్పనలో మెడికవర్ ఆసుపత్రి సీఈఓలు, డైట్ మేనేజర్ డేవిడ్, జార్జ్, వెంకట కిషోర్, సాగర్ తదితరులు పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర రెడ్డి, డాక్టర్ పెంచల ప్రసాద్ తదితర వైద్యులు, ఆసుపత్రి ప్రతినిధులు పాల్గొన్నారు. మధుమేహంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సహకరించాలని ఆసుపత్రి వర్గాలు కోరాయి.