మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి ఏపీ ఎం.హెచ్.సి జేఏసీ ధర్నాలో సాకే హరి
అనంతపురం బ్యూరో : సమాన పనికి సమాన వేతనం దక్కాలంటే మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు.మంగళవారం నగరంలోని ప్రభుత్వ సర్వజన అస్పత్రి ఆవరణంలో మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని అంద్రప్రదేశ్ మెడికల్ హెల్త్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలకు సాకే హరి పాల్గొని మద్దతుగా మాట్లాడుతూ..ఇరవై ఏళ్లుగా ప్రభుత్వంలో భాగమై స్థాప్ నర్సులు,ల్యాబ్ టెక్నీషియన్స్,ఫార్మా, కార్డియాసిస్టులు, కార్డియాలాజిస్టులు,ఓపి టెక్నీషియన్స్ గా ప్రజలకు సేవలందిస్తున్న వారిని గుర్తించలేదన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత కాంట్రాక్ట్ ఉద్యోగులదే అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 10,500మంది మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు గొడ్డు చాకిరీ చేస్తున్న ప్రభుత్వం గుర్తించక పోవడం బాధాకరమన్నారు.ప్రభుత్వానికి కాంట్రాక్ట్ ఉద్యోగులంటే చిన్నచూపుగా ఉందని నెల రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ పట్టించుకోలేదని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకంగా నేడు వైద్య సేవలను బహిస్కరించి ఉద్యమ తీవ్రత పెంచుతున్నమన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్ని రకాల అవకాశాలు కల్పించేంత వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు.కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ దిన్నె శరత్ బాబు వైస్ చేర్మెన్.జి వెంకట నారాయణ.కన్వీనర్ పి లావణ్య.ఏపీ జిసి ఎన్ ఏ ప్రెసిడెంట్ పి శ్రీదేవి వర్కింగ్ ప్రెసిడెంట్ జి ప్రశాంతి కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.