BREAKING
నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

మహాగణపతి ఉత్సవాల విజయానికి మీడియా సహకారం అభినందనీయం

Select Suryaa Now
మహాగణపతి ఉత్సవాల విజయానికి మీడియా సహకారం అభినందనీయం

మహాగణపతి ఉత్సవాల విజయానికి మీడియా సహకారం అభినందనీయం 

ఉత్సవాల విశేషాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు 

మచిలీపట్నం అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి

మచిలీపట్నం మహానగరంగా ఎదిగే అవకాశాలు 

ఉత్సవాల విజయానికి ప్రతి ఒక్కరి సహకారం అభినందనీయం 

రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ :ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : సాగర తీర మహాగణపతి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల ప్రతినిధులు అందించిన సహకారం ఎంతో అభినందనీయమని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మహాగణపతి ఉత్సవాల విశేషాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఉత్సవాల విజయాన్ని పురస్కరించుకుని ఆదివారం మచిలీపట్నంలోని సువర్ణ కళ్యాణ మండపంలో సాగర తీర మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల ఆత్మీయ అభినందన సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్సవాలను ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయడంలో మీడియా అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్సవాల విశేషాలు విస్తృతంగా ప్రజలకు చేరాయని, పలువురు వ్యక్తిగతంగా కార్యక్రమాలకు హాజరై వీడియోలు రూపొందించి ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. మచిలీపట్నం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, త్వరలో తీరానికి పోర్టు రానుండటం, ప్రతిష్టాత్మక గోవా షిప్‌యార్డ్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించడం వంటి పరిణామాలు ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. సుమారు రూ.8 వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టులపై ముందడుగు పడుతోందన్నారు. మచిలీపట్నం భవిష్యత్తులో మహానగరంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నాయని, ప్రజలు, వ్యాపార వర్గాలు, వివిధ సంస్థలు ‘ఇది మన నగరం.. మన బాధ్యత’ అనే భావనతో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల నిర్వహణలో కమిటీ సభ్యులు, అధికారులు, వివిధ వర్గాల ప్రజలు అందించిన సహకారాన్ని అభినందించిన మంత్రి, వినూత్న లైటింగ్, అలంకరణలు, కార్పెట్ తదితర ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. ఉత్సవాల విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇకపై కూడా మచిలీపట్నం అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సాగర తీర మహాగణపతి ఉత్సవ కమిటీ చైర్మన్ చలమలశెట్టి నరసింహారావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి. జయరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కమిటీ సభ్యులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల ప్రతినిధులు పాల్గొన్నారు.