BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

మధుమేహ వ్యాధిపై నిర్లక్ష్యం తగదు , ముందస్తు చర్యలతో నివారణ సాధ్యం

Select Suryaa Now
మధుమేహ వ్యాధిపై నిర్లక్ష్యం తగదు , ముందస్తు చర్యలతో నివారణ సాధ్యం

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ :  వరల్డ్ డయాబెటిస్ డే (ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం) సందర్భంగా డాక్టర్ మాధవ్ డయాబెటిస్ కేర్ సెంటర్, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్  ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా  సంయుక్త ఆధ్వర్యంలో శనివారం, ఉమ్మారెడ్డి గుంటలోని వినాయక మందిరం ఆవరణములో షుగర్ వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షలు మరియు అవగాహన సదస్సు జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవ్ డయాబెటిస్ కేర్ సెంటర్ వైద్యులు డాక్టర్ మాధవ్ పావులూరి పాల్గొని మాట్లాడుతూ మధుమేహ వ్యాధి గతంలో 50ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఎక్కువగా వచ్చేదని, అది కూడా పురుషులపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉండేదని అన్నారు. నేడు మధుమేహ వ్యాధిగ్రస్తులలో పురుషులతోపాటు స్త్రీలు అధికంగా బాధపడుతున్నారని, ఇంటి పనులు, ఉద్యోగం, ఒత్తిడి తదితర అంశాలు దీనికి ముఖ్య కారణం అవుతాయని తెలిపారు. ఇటువంటి తరుణంలో ఈ వ్యాధిపై నిర్లక్ష్యం వీడి ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా మేలని అన్నారు. ప్రస్తుత జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు కారణంగా చిన్నపిల్లల సైతం మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారని, ఈ వ్యాధి ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత సొంత వైద్యం, ఆహార నియమాలు మార్చుకోవడం తగదన్నారు. షుగర్ వ్యాధి బారిన పడిన వారు డయాబెటాలజిస్ట్ ను సంప్రదించి తగు సూచనలు, సలహాలు పాటించడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచడమే కాకుండా ప్రాణాంతకమైన ఇతర వ్యాధులు సంక్రమించకుండా అరికట్టవచ్చని తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా సంబంధిత రక్త పరీక్షలు గుర్తింపు పొందిన ల్యాబ్ లో చేయించుకొని స్పెషలిస్ట్ డాక్టర్ల సలహాలతో, డైటీషియన్ల పర్యవేక్షణలో ఆహార నియమాలు పాటిస్తూ, ప్రతిరోజు విధిగా కనీసం 30 నిమిషాల పాటు నడక, ఇతర వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలన్నారు. అనంతరం జిల్లా పి.హెచ్.పి నాయకులు డా. మాధవ్ పావులూరిని, దేవస్థానం చైర్మన్ ఒంగోలు సురేష్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పి.హెచ్.పి గౌరవాధ్యక్షులు అనుముల జయప్రకాష్, కోఆర్డినేటర్ కొండాపురం వెంకటేశ్వర్లు, రూడ్స్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, పీ.హెచ్.పీ నాయకులు శాఖవరపు వేణుగోపాల్, గోరంట్ల శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు, ఉప్పలపాటి రామదాసు,  తదితరులు పాల్గొన్నారు.