మాక్సీవిజన్ ఆధ్వర్యంలో 2 కి.మీ. వాకథాన్
విజయవాడ, మేజర్ న్యూస్ : ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని డయాబెటిక్ రెటినోపతి, కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి విజయవాడ ప్రధాన శాఖ ఆధ్వర్యంలో శనివారం 2 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ఆసుపత్రి నుంచి ప్రారంభమైన వాకథాన్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ముగిసింది. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రవిచంద్ర, డాక్టర్ స్వాతి, అమృత హస్తం సోషల్ సర్వీస్ ఫౌండేషన్‌కు చెందిన లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కరుణాశ్రీ బృందం, ఆసుపత్రి సిబ్బంది, ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మధుమేహం వల్ల కంటి చూపుపై పడే ప్రభావం, డయాబెటిక్ రెటినోపతి నివారణ, సకాలంలో కంటి పరీక్షల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించడమే వాకథాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. సమాజంలో నివారణ ఆరోగ్య సంరక్షణపై చైతన్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మాక్సీవిజన్ విజయవాడ శాఖలో రెటీనా సంరక్షణ, గ్లాకోమా నిర్వహణ, కెరటోకోనస్ చికిత్స, ఆర్బిట్, ఓక్యులోప్లాస్టీ, సాధారణ నేత్ర వైద్య సేవలతో పాటు ఆప్టికల్స్, ఫార్మసీ సేవలను ఆధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో అందిస్తున్నట్లు వివరించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.