BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

మాచవరంలో ప్రమాదకరంగా ఒరిగిన విద్యుత్ స్తంభం: భయాందోళనలో గ్రామస్తులు, తక్షణమే తొలగించాలని విజ్ఞప్తి!

Select Suryaa Now
 మాచవరంలో ప్రమాదకరంగా ఒరిగిన విద్యుత్ స్తంభం: భయాందోళనలో గ్రామస్తులు, తక్షణమే తొలగించాలని విజ్ఞప్తి!

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మేజర్ న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండల పరిధిలోని మాచవరం గ్రామ శివారు జక్కంశెట్టివారిపాలెంలో విద్యుత్ స్తంభం ఒకటి ప్రమాదకరంగా పక్కకు ఒరిగిపోయింది. ఏ క్షణంలోనైనా కూలిపోయే స్థితిలో ఉన్న ఈ స్తంభాన్ని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఒరిగిన స్తంభంపై నుంచి హై-వోల్టేజ్ విద్యుత్ తీగలు వెళుతుండటంతో పాటు చుట్టూ పిచ్చి మొక్కలు, చెట్లు దట్టంగా అల్లుకుపోయాయి. ఈ మార్గం గుండా నిత్యం రాకపోకలు సాగించే రైతులు, విద్యార్థులు, బాటసారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.

ఈదురుగాలులు, వర్షాలు వస్తే స్తంభం పూర్తిగా నేలకూలి పెను ప్రమాదం సంభవించే ముప్పు ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, ప్రమాదకరంగా మారిన స్తంభాన్ని తొలగించి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.