కుందుర్పి లో పసుపు జెండాలతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం.
కుందుర్పి: కుందుర్పి మండలం తూముకుంట గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా కొనసాగింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తూముకుంట, కృష్ణాపురం గ్రామాలకు చెందిన పసుపు వీర మహిళలు పెద్ద సంఖ్యలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తెలుగుదేశం పార్టీ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, పసుపు జెండాలను చేతబట్టి ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామ వీధుల్లో మహిళల ఉత్సాహం, పార్టీ నినాదాలు, పాటలతో ఎన్నికల వాతావరణం సందడిగా మారింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం కొనసాగించారు. మహిళల భాగస్వామ్యం, కార్యకర్తల ఉత్సాహంతో తూముకుంట, కృష్ణాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పసుపు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.