BREAKING
గ్రామ పంచాయతీ కీ సర్పంచ్ ప్రథమ పౌరుడు రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి టీయూడబ్ల్యూజే, ఐజేయు నేతల నివాళులు ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు పొడిగింపు: డిసెంబర్ 16న గోవాలో మినీ వేలానికి ఏర్పాట్లు సీఎంగారూ..! తులం బంగారం ఎప్పుడు ఇస్తారు....? : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ మోటార్ల చోరీ కివీస్‌తో తొలి వన్డే: టీమిండియా సంభావ్య ప్లేయింగ్ ఎలెవన్ ఖరారు.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో పటిష్టంగా భారత్ *ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!* మూకుత్తి అమ్మన్ 2 మహాశక్తి వీడియో సాంగ్ విడుదల: నవంబర్ 6న థియేటర్లలోకి నయనతార చిత్రం ఇవి 'ఎలక్షన్లు' కావు.. 'సెలక్షన్లు': ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ తనుష్ ఓమ్ సినిమా ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు: నవంబర్ 6న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ప్రతి నీటి బొట్టూ అమృతమే!* *జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం* అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం

కొత్తపేట నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

Select Suryaa Now
కొత్తపేట నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

                              చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన చోడపనీడి సతీష్, ముద్రగడ సత్యనారాయణ

రావులపాలెం మేజర్ న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట గ్రామానికి చెందిన పలువురు నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు.
కొత్తపేట సంతోష్ నగర్‌కు చెందిన చోడపనీడి సతీష్, ముద్రగడ సత్యనారాయణ (వెంకన్న) గోపాలపురంలో చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుని వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, గుర్తింపు ఉంటాయని తెలిపారు.