BREAKING
నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు!

కోటిపల్లిలో పర్యటించిన ఐజీ అశోక్

Select Suryaa Now
కోటిపల్లిలో పర్యటించిన ఐజీ అశోక్

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

కోటిపల్లి గ్రామంలో ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ శనివారం పర్యటించారు.ఈ సందర్భంగా స్థానిక పుష్కరాల బస్టాండ్‌తో పాటు పోలీస్ ఔట్‌పోస్టులను పరిశీలించారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై క్షేత్రస్థాయిలో సమీక్షించినట్లు తెలిపారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల సౌకర్యం, వాహనాల పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై పరిశీలన చేసినట్లు పేర్కొన్నారు.పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రత, రాకపోకల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యలపై ఈ పర్యటనలో దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా,డీఎస్పీ శేషు,సీఐ ఎం.వెంకటనారాయణ,ఎస్ఐలు జి.సోమేంద్ర,ఎం.లక్ష్మణ్,నాగేశ్వరరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.