BREAKING
మెడ దగ్గర వాపు కనిపిస్తోందా? గాయిటర్ సమస్య సంకేతం కావచ్చు.. కారణాలు ఇవే! గల్లంతయిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఆచూకీ కోసం... ఎల్ నినో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ రిటెన్షన్‌పై ఫుల్ క్లారిటీ! ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయం డయాబెటిస్ వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? రెటీనా సమస్యలపై వైద్య నిపుణుల హెచ్చరిక! సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి..! రామ్ చరణ్ – సుకుమార్ ‘RC17’ బడ్జెట్ రూ.400 కోట్లు? ఇండియన్ బాక్సాఫీస్‌పై మరో సంచలనం! చలికాలంలో చర్మం పగలకుండా మెరిసిపోవాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి! బేతుపల్లి చెరువులో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి గల్లంతు కేవలం హీరోలే కాదు, మేమూ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టగలం: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు! ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు!

కోటవురట్లకు ఎన్నికల డ్యూటీకి వచ్చిన కమెడియన్ సత్తిపండు!

Select Suryaa Now
కోటవురట్లకు ఎన్నికల డ్యూటీకి వచ్చిన కమెడియన్ సత్తిపండు!

 

ఎస్.రాయవరం, నవంబర్ 4, మేజర్ న్యూస్:
ఎన్నికల విధుల నిర్వహణలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ కమెడియన్ గా సుపరిచితులైన సత్తిపండు ఎన్నికల డ్యూటీకి కోటవురట్ల మండలానికి వచ్చారు. వివరాల్లోకి వెళితే... సత్తిపండు ప్రస్తుతం పాయకరావుపేట మండలం, గోపాలపట్నం యూపీ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఆయనకు పీఓ (ప్రిసైడింగ్ ఆఫీసర్) గా బాధ్యతలు అప్పగించారు. జల్లారులో విధులు నిర్వహించేందుకు బ్యాలెట్ బాక్స్ ను తీసుకుని ఆయన విధులకు బయలుదేరారు.

ఈ సందర్భంగా సత్తిపండు మాట్లాడుతూ, తన ఉద్యోగ జీవితం కోటవురట్ల మండలంలోనే మొదలైందని గుర్తు చేసుకున్నారు. తన మొదటి అపాయింట్మెంట్ కోటవురట్ల మండలంలోనే వచ్చిందని, ఆ తర్వాత నీలిగుంట, అల్లుమియాపాలెం ఎంపీపీ స్కూళ్లలో టీచర్ గా పని చేశానని తెలిపారు. చాలా కాలం తర్వాత మళ్లీ అదే మండలానికి ఎన్నికల విధుల నిమిత్తం రావడం సంతోషంగా ఉందన్నారు. టీచర్ గా విధులు నిర్వహిస్తూనే కమెడియన్ గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్తిపండు ఎన్నికల డ్యూటీలో కనిపించడంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది.