కోరం లేక వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక... ఎన్నికను వాయిదా వేసిన ఎన్నికల అధికారి.. కళ్యాణ వెంకటేష్
ములకలచెరువు, మేజర్ న్యూస్,ములకలచెరువు: మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నికకు కోరం లేకపోవడంతో మొలకలచెరువులో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. మండలంలోని మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను గురువారం నిర్వహించిన సమావేశానికి కేవలం నలుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి కళ్యాణ వెంకటేష్ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.సమావేశానికి హాజరైన నలుగురు ఎంపీటీసీ సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. మిగిలిన సభ్యులు హాజరు కాకపోవడంతో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ ముందుకు సాగలేదు.ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ రాజారెడ్డి, ఎస్‌ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోరం లేక ఎన్నిక వాయిదా పడటంతో శుక్రవారం నిర్వహించనున్న ఎంపీపీ ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
రిపోర్టర్: గౌరీ శంకర్, తంబళ్లపల్లి