BREAKING
గ్రామాలలో పంట నష్టం వివరాల సేకరణ* మండల వేవసాయధికారి పి. శ్రావణ కుమారి.. ఐపీఎల్ 2027: మరింత పటిష్టంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ దళం, టైటిలే లక్ష్యంగా వ్యూహాలు ఏషియన్ పారా గేమ్స్ విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ: దేశానికే గర్వకారణమంటూ అభినందనలు పీయులో ఇంటిగ్రేటెడ్ ఓరియంటేషన్ కార్యక్రమం ఎస్‌ఏఎఫ్ ఎఫ్ ఛాంపియన్‌షిప్: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన భారత్ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం: విరాట్ కోహ్లీ అదరహో అనంతగిరిలో 65% ఓటింగ్ ఎనర్జీ డ్రింక్స్ అలసటను పోగొట్టే అమృతమా లేక అనారోగ్యాల నిలయమా: ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు మాడుగులలో ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్: 72 శాతం నమోదు వాయు కాలుష్యం బారి నుంచి ఊపిరితిత్తులను రక్షించే అద్భుతమైన ఆహారాలు ఇవే చెదురు మదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం మాకవరపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ. ఉదయం పూట ఓట్స్ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు పుస్తక పఠనంతో విజ్ఞానం మీ సొంతం కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు.

కూటమిలో కుదరని సయోధ్య!

Select Suryaa Now
కూటమిలో కుదరని సయోధ్య!

మెలియాపుట్టి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల వేళ మెలియాపుట్టి మండలంలో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్న లక్ష్యంతో సీట్ల సర్దుబాటు చేసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి ఒప్పందంలో భాగంగా టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసినా.. జనసేన అభ్యర్థులు కూడా బరిలో నిలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా పనిచేయాల్సిన నాయకులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఒకవైపు టీడీపీ నాయకులు తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తుండగా, మరోవైపు జనసేన నాయకులు ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. దీంతో కూటమి పార్టీల మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు ఒప్పందం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు పార్టీల నాయకులు వేర్వేరుగా ప్రచారం చేయడం వల్ల కూటమి ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ప్రత్యర్థి పార్టీలకు ఈ పరిణామాలు కలిసివస్తాయా? కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. పైస్థాయిలో కూటమి ఐక్యత గురించి చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో, వారి తీర్పు కూటమి పార్టీల మధ్య సమన్వయానికి ఎలాంటి సంకేతాలిస్తుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.