BREAKING
​ప్రశాంత వాతావరణంలో చైర్‌పర్సన్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన ఇల్లందు రామ్‌దేవ్ బాబా మందిరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు పాలకొండ లో ఉచిత ఆయుష్ వైద్య శిబిరం * జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డా. హేమాక్షి * చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశం* ఆత్మీయ మిత్రుడు రోకటి ఇంటికి మంత్రి తుమ్మల చేతుల మీదుగా..‘ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల’కు భూమిపూజ - రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో. ​స్వర్గీయ సరోజిని ముఖర్జీ ఆదరణ కూడికకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి బాధిత కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం పదో తరగతిలో 555 మార్కులు-గోపా ప్రతిభా పురస్కారం.- అంబాల మణికంఠ సాయికి ఘన సన్మానం. ఎంపీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల వచ్చే విజయదశమి నాటికి జూలూరుపాడు టన్నెల్‌ పూర్తి చేయాలి -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శి లో వైసీపీ నామినేషన్ తిరస్కరణ. వైసీపీ అభ్యర్థులు వీరే పూలను పూజించే గొప్ప వేడుక బతుకమ్మ పండుగ : నందికంటి శ్రీధర్ 'పీఠ'ముడి వీడుతున్నట్టేనా! *కొలిక్కివస్తున్న 'సర్దుబాటు' చర్చలు..

కూటమి చేసిన అభివృద్ధే మా గెలుపునకు బాటలు: అవనాపు విజయ్

Select Suryaa Now
కూటమి చేసిన అభివృద్ధే మా గెలుపునకు బాటలు: అవనాపు విజయ్

విజయనగరం మేజర్ న్యూస్:

కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయాన్ని నిర్ణయిస్తాయని అవనాపు విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమపై నమ్మకంతో అవకాశం కల్పించిన నాయకులకు, ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు తమ గెలుపునకు ఎంతగానో దోహదపడతాయని విజయ్ పేర్కొన్నారు. VMRDA, విద్యుత్ శాఖల ద్వారా ఇటీవల నియోజకవర్గానికి విడుదలైన నిధులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పి4 (P4) విధానం మరియు వివిధ సంక్షేమ పథకాలు ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని నింపాయని చెప్పారు. కూటమి అందిస్తున్న ఈ పాలనను, అభివృద్ధిని చూసే ప్రజలు ఓటు వేయాలని ఆయన కోరారు.

కలిసికట్టుగా కూటమి విజయం కోసం కృషి

సీట్ల సర్దుబాటు అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. “నాన్నగారి ఆశయాలకు అనుగుణంగా, ఎమ్మెల్యేతో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం. అన్నదమ్ములం ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తూ ఇప్పటికే ప్రచారంలో కూడా పాల్గొంటున్నాం” అని విజయ్ స్పష్టం చేశారు.

తమ జీవితం, భవిష్యత్తు పార్టీతోనే ముడిపడి ఉన్నాయని, అందరం ఏకతాటిపై నిలిచి కూటమి విజయాన్ని ఖాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.