కోలాహాలంగా వైకాపా నామ పత్రాల దాఖలు
పూసపాటిరేగ, సూర్య : మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు జరుగునున్న ఎన్నికలకు చౌడువాడ నుంచి వైకాపా తరుపున కొయ్య రామస్వామి నామ పత్రాలను దాఖలు చేసేందుకు నాగబాబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బుధవారం తరలివచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోపికి అభ్యర్థి రామస్వామి అందజేశారు. నాంపత్రాల స్వీకరణ కార్యక్రమంలో నాగబాబు తో పాటు ఎల్లన్న రెడ్డి కూడా పాల్గొన్నారు. నాంపత్రాల దాఖల అనంతరం రామస్వామికి మద్దతుగా మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా విజయదరహసం చూపుతో పూలపాలతో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుష్పం ఎంపీటీసీ అభ్యర్థిగా వైకాపా మండల అధ్యక్షుడు పధ్వాడ అప్పలనాయుడు నామ పత్రాలను రిటర్నింగ్ అధికారి గోపికి అందజేశారు. అప్పలనాయుడుకు మద్దతుగా బొత్స చైతన్య, మరి కొందరు పార్టీ నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.