కక్కలపల్లి కాలనీ 03 కూటమి అభ్యర్థి పతకమూరి శ్రీనివాసులు భారీ మెజార్టీతో గెలుపు
భారీ మెజార్టీతో.. కక్కలపల్లి కాలనీ 3 కూటమి ఎంపీటీసీ అభ్యర్థి పతకమూరి శ్రీనివాసులు గెలుపు
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలలో అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ 3 ఎంపీటీసీ స్థానం నుంచి.. కూటమి అభ్యర్థి పతకమురి శ్రీనివాసులు దాదాపు 316 ఓట్ల వారి మెజార్టీతో.. గెలుపొందారు. గెలుపొందిన అనంతరం ఎన్నికల అధికారుల నుంచి డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. శ్రీనివాసులకు స్థానికంగా.. ప్రజలలో అందుబాటులో ఉంటూ.. మంచి పేరు ఉంది. దీనికి తోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ దృష్టికి తీసుకెళ్లి... కక్కలపల్లి కాలనీలో అనేక ఏళ్లుగా రోడ్డు లేని కాలనీలకు రోడ్లు వేయించారు. కాలనీ ప్రజలందరూ కూడా.. పతకమూరి శ్రీనివాసులు వైపు మొగ్గుచూపి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. గెలుపు అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం నుంచి అత్యధిక మెజార్టీలో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ... ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని పతకమూరి శ్రీనివాసులు తెలిపారు.