విద్యార్థుల్లో సేవాభావం.. నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి
*విద్యార్థుల్లో సేవాభావం.. నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి
స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో ఉత్తమ పౌరులుగా ఎదగొచ్చు: ఎంఈఓ మనోజ్‌కుమార్
రాజపేట :విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, సమయపాలన, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కీలకపాత్ర పోషిస్తుందని రాజాపేట మండల విద్యాశాఖాధికారి కె. మనోజ్‌కుమార్ అన్నారు. మండలంలోని రఘునాథపురం ఎస్‌ఎస్‌ఎన్‌ఎం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోవాలని సూచించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో భాగస్వాములు కావడం ద్వారా ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యంతోపాటు సమాజ సేవ పట్ల బాధ్యత పెరుగుతుందన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో పాఠశాల స్కౌట్ మాస్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, గైడ్ కెప్టెన్ జె. మౌనిక విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ లక్ష్యాలు, ప్రాధాన్యతను వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.