BREAKING
నేడు స్టాక్ మార్కెట్ సంవత్ 2083 ముహూర్త్ ట్రేడింగ్ శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం కర్ణాటకలో ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: ప్రైవేట్ కళాశాలల ఫీజుల తగ్గింపు 2028 బంగారం ధరలపై ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలు ఈ సంవత్ మార్కెట్లు నేర్పిన 10 ప్రధాన పాఠాలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు రాజస్థాన్ బోర్డ్ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటన వైట్‌హౌస్ నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని కలసిన జడ్పిటిసి సౌమ్య ఏఐ క్షీణతతో భారత్, చైనా మార్కెట్లకు విదేశీ నిధుల వెల్లువ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత: హోర్ముజ్ వద్ద పేలుళ్లు, అరామ్‌కోపై దాడులు మేడ్చల్ వెస్లీ చర్చిలో ఘనంగా పంట పండుగ వేడుకలు ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు పిలుపు న్యూజిలాండ్ ఎన్నికల్లో మితవాద కూటమి ఆధిక్యం

దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు తేవాలి : తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

Select Suryaa Now
దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు తేవాలి : తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

 

మదనపల్లి,మేజర్ న్యూస్ : దీపావళి పండుగ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని తెలుగుదేశం పార్టీ యువనేత,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గం,మదనపల్లి పట్టణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.భారతదేశం సర్వమత సమ్మేళనమని,అన్ని మతాలవారు ఐకమత్యంతో ముందుకు సాగి మతసామరస్యాన్ని చాటుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారని తెలిపారు.ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో హిందూ,ముస్లిం అన్ని పండుగలు ఐకమత్యంతో జరుపుకోవడం సోదర భావానికి నిదర్శనమన్నారు.కూటమి పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తున్నారని,సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఏపీ,ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా నేతృత్వంలో మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని కొనియాడారు.కూటమి పాలనలో మరింత అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయన్నారు.అదేవిధంగా మున్సిపల్,ఎంపీటీసీ,జెడ్పిటిసి ఎన్నికలలో విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి