ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
నవాబుపేట సూర్య న్యూస్: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తానం సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు,కార్యకర్తలు కలిసి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)చైర్మన్ హరలింగం,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.