*గుండెపోటుతో మాజీ ఎంపిటిసి సభ్యులు కొత్త పాండుగౌడ్ మృతి*
*గుండెపోటుతో మాజీ ఎంపిటిసి సభ్యులు కొత్త పాండుగౌడ్ మృతి*
*మాడ్గుల మండలంలో తీవ్ర విషాదఛాయలు*
మాడ్గుల ( రంగారెడ్డి)
మాడ్గుల మాజీ ఎంపిటిసి సభ్యులు, కె.పి. డెవలపర్స్ అధినేత, కాంగ్రెస్ సీనియర్ నేత కొత్త పాండుగౌడ్ ఆదివారం ఉదయం గుండెపోటుకు గురై మృతిచెందిన వార్త మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం ఛాతీలో తీవ్ర నొప్పికి గురైన పాండుగౌడ్ ను ఆయన భార్య నర్సాయపల్లి సర్పంచ్ కొత్త జ్యోతిగౌడ్, కుమారుడు గౌతం , కుటుంబీకులు, గ్రామస్థుల సహాయంతో హైద్రాబాద్ సాగర్ కాంప్లెక్స్ సమీపంలోని బృంగీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారని కుటుంబీకులు తెలిపారు. సంఘాలు, పార్టీలకతీతంగా అందరితో కలుపుగోలుగా వుండే పాండుగౌడ్ అకాల మృతిపట్ల వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, మిత్రులు దిగ్ర్భాంతికి గురై ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
---------
ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల