తకెళ్లపాడు తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో ఎమ్మెల్యే BLR లబ్ధిదారు కుటుంబంతో కలిసి ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాలు.. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
తకెళ్లపాడు తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో ఎమ్మెల్యే BLR
లబ్ధిదారు కుటుంబంతో కలిసి ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాలు.. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: మిర్యాలగూడ మండలం తకెళ్లపాడు తండా గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారు భూక్యా సుజాత నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ వేడుకల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన గృహానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే, లబ్ధిదారు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారు కుటుంబంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని పండుగ సంబరాలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుండు నరేందర్ గౌడ్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.