ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి.. సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి: ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్: దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. చీకటిని పారద్రోలి వెలుగులు విరజిమ్మే దీపావళి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. పండుగ సంబరాల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే బాణసంచా కాల్చాలని, ప్రమాదాలకు తావులేకుండా పర్యావరణ హితంగా, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ దీపావళి ప్రతి ఇంటా సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మేడ్చల్ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఎంపీ ఈటల రాజేందర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.