బొంరాస్‌పేటలో నూతన ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
బొంరాస్‌పేట,మేజర్ న్యూస్: బొంరాస్‌పేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, పోలీస్ స్టేషన్ నూతన భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, అనంతరం పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. నూతన భవనాల అందుబాటుతో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ కార్యక్రమాలకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సిరి రాజేష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యుడు గండిడ్ నరసింహులు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్: శ్రీశైలం, బొంరాస్ పేట్, వికారాబాద్ జిల్లా.