BREAKING
నేడు స్టాక్ మార్కెట్ సంవత్ 2083 ముహూర్త్ ట్రేడింగ్ శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం కర్ణాటకలో ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: ప్రైవేట్ కళాశాలల ఫీజుల తగ్గింపు 2028 బంగారం ధరలపై ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలు ఈ సంవత్ మార్కెట్లు నేర్పిన 10 ప్రధాన పాఠాలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు రాజస్థాన్ బోర్డ్ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటన వైట్‌హౌస్ నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని కలసిన జడ్పిటిసి సౌమ్య ఏఐ క్షీణతతో భారత్, చైనా మార్కెట్లకు విదేశీ నిధుల వెల్లువ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత: హోర్ముజ్ వద్ద పేలుళ్లు, అరామ్‌కోపై దాడులు మేడ్చల్ వెస్లీ చర్చిలో ఘనంగా పంట పండుగ వేడుకలు ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు పిలుపు న్యూజిలాండ్ ఎన్నికల్లో మితవాద కూటమి ఆధిక్యం

రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

Select Suryaa Now
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

రాజేంద్రనగర్: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. హిమాయత్ సాగర్ సమీపంలో ముందు వెళ్తున్న ట్రక్‌ను ఒక గూడ్స్ ఆటో వేగంగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముచ్చింతల్ ప్రాంతంలో ఒక భవనానికి పెయింటింగ్ పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 17 మంది ఉన్నట్లు సమాచారం. హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే, నిద్రమత్తులోకి జారుకున్న ఆటో డ్రైవర్ ముందర వెళ్తున్న ట్రక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘాతానికి ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పారిపోగా, ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది దాదాపు 20 కిలోమీటర్ల మేర ఛేజ్ చేసి లారీని పట్టుకున్నారు.

సమాచారం అందుకున్న స్థానిక రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పండుగ పూట ఈ ఘోర ప్రమాదం జరగడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది.