తడగొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
సూర్య బోయినపల్లి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను తడగొండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తడగొండ గ్రామ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సద్గురు సాయినాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్, గ్రామ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ చేపూరి వెంకటేష్ పటేల్, వార్డు సభ్యులు ఎడపెల్లి నవ్య-భూమేష్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మండల నరేష్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు చేపూరి కనకయ్య, ఎండి హుస్సేన్, గుడి రాజశేఖర్ రెడ్డి, మండల శ్రీనివాస్, ఎండి రఫీ, ఆముదాల లక్ష్మారెడ్డి, చింతలకోటి మహేష్, సింగరి నరేష్, కాదసు వివేక్, తడగొండ రాజేష్, ఎండి సమీర్, ఉయ్యాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.