సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఏఎంసీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్
వికారాబాద్, మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన జిల్లా వాసి కావడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. ఆయన నాయకత్వంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తున్న రైతు బాంధవుడు రేవంతన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.