గంటలోనే 10 తులాల బంగారం రికవరీ చేసిన పోలీసులు
సూర్య జగిత్యాల ప్రతినిధి: గొల్లపల్లి మండలానికి చెందిన మూట శంకర్ తన మరదలి వివాహం నిమిత్తం బొంబాయిలో 10 తులాల బంగారం కొనుగోలు చేసి బ్యాగులో భద్రపరుచుకొని ధర్మపురికి బయలుదేరాడు. జగిత్యాల నుంచి ధర్మపురికి వెళ్లే బస్సులో ప్రయాణిస్తుండగా వెల్గొండ స్టేజీ దాటిన అనంతరం తన బ్యాగు కనిపించకపోవడంతో వెంటనే డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.వెంటనే స్పందించిన బ్లూకోల్ట్స్ విధుల్లో ఉన్న బుగ్గారం పోలీస్ కానిస్టేబుల్ సంపత్ ఫిర్యాదు వివరాలను ఎస్ఐ శ్రీకాంత్‌కు తెలియజేశారు. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ కానిస్టేబుల్ సంపత్‌తో కలిసి తక్షణమే రంగంలోకి దిగి వెల్గొండ స్టేజీ పరిసరాల్లో విచారణ చేపట్టారు. ఎస్ఐ శ్రీకాంత్ బంగారాన్ని స్వాధీనం చేసుకొని బాధితుడు మూట శంకర్‌ను, అతని బావమరిదిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి 10 తులాల బంగారాన్ని వారికి అప్పగించారు.