జలపహారేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రత్యేక పూజలు
ఏలూరు, సూర్య న్యూస్: ఏలూరు నగరంలోని దక్షిణపు వీధిలో కొలువై ఉన్న శ్రీ జలపహారేశ్వర స్వామి ఆలయాన్ని ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు ఎంపీకి శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనం అందించారు. రాష్ట్రంలోనూ, ఏలూరు పార్లమెంట్ పరిధిలోనూ వర్షాలు పడి, రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని ప్రార్ధించినట్లు ఎంపీ తెలిపారు.