BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

జలదంకిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శ్రీ సాయి హైస్కూల్, ఇంటర్, టీటీసీ కళాశాలలో సందడిగా నిర్వహణ

Select Suryaa Now
జలదంకిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శ్రీ సాయి హైస్కూల్, ఇంటర్, టీటీసీ కళాశాలలో సందడిగా నిర్వహణ

జలదంకి, మేజర్ న్యూస్ :  శ్రీ సాయి హైస్కూల్, ఇంటర్, టీటీసీ కళాశాల జలదంకి క్యాంపస్ నందు బాలల దినోత్సవాన్ని అయ్యల రెడ్డి సారథ్యంలో ఘనంగా నిర్వహించారు.
చాచా నెహ్రూ జయంతి సందర్భంగా వేడుకలు
భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబర్ 14. నెహ్రూ గారికి పిల్లలంటే చాలా చాలా ఇష్టం. అందుకే పిల్లలు ఆయనను ముద్దుగా "చాచా నెహ్రూ" అని పిలుస్తారు. నెహ్రూ భావం ప్రకారం నేటి బాలలే రేపటి పౌరులు.
పిల్లల హక్కులపై అవగాహన
ఈ రోజు కేవలం పండుగే కాదు, పిల్లల హక్కుల గురించి గుర్తు చేసుకునే రోజు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యం, ఆడుకోవడానికి తగిన వాతావరణం అందాలని నిర్వాహకులు తెలిపారు.
సాంస్కృతిక, క్రీడా పోటీలతో సందడి
ఈ సందర్భంగా పిల్లలకు అందుబాటులో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడా విన్యాస కార్యక్రమాలు కూడా అధ్యాపకుల పర్యవేక్షణలో నిర్వహించారు.
ప్రీ-ప్రైమరీ, ఎలిమెంటరీ, హైస్కూల్ విద్యార్థులకు వేరు వేరుగా వక్తృత్వ పోటీలు, వ్యాస రచన పోటీలు, రైమ్స్ పోటీలు, కబాడీ, పరుగు పందాలు మొదలగునవి నిర్వహించి పిల్లల మనోధైర్యాన్ని పెంచి, ఆహ్లాదపరిచారు.
అభినందనలతో ముగిసిన వేడుక
ఈ నాటి పిల్లల సందడి పండుగలో స్కూల్ క్యాంపస్ లోని ప్రతి ఒక్కరు పాల్గొని పిల్లలను సంతోషపెట్టి, అభినందనలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.