andhrapradesh
జడ్పిటిసి అభ్యర్థి కత్తి సరోజిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి.
మాచవరం న్యూస్ : మాచవరం మండలంలోని తు రకపాలెం,పిన్నెల్లి గ్రామంలలో కూటమి ప్రభుత్వం బలపరిచిన టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి కత్తి సరోజిని ప్రచారం కొనసాగుతుంది. ఈనెల 5న జడ్పిటిసి ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ప్రచారం రోజురోజుకు ప్రచారం ఊపందుకుంది. జడ్పిటిసి అభ్యర్థి కత్తి సరోజినీ మాట్లాడుతూ గురజాల నియోజకవర్గం శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు కూలి పని చేసుకునే నాకు, దళిత సామాన్యురాలు అయిన నాకు జడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం కల్పించాలని ఆమె అన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న అన్నారు. మండలంలోని కూటమి నాయకులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమం అధిక సంఖ్యలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షులు షేక్ అసాన్వలి, మాజీ సర్పంచ్ షేక్ మాబు వలి, గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ అల్లావుద్దీన్, డాక్టర్ షేక్అల్లావుద్దీన్, పిన్నెల్లి మాజీ సర్పంచ్ చింతపల్లి నన్ని (జానీ భాష), టిడిపి సీనియర్ నాయకులు గుంటూరు దస్తగిరి, వై రామిరెడ్డి, కూ టమ నాయకులు టిడిపి నాయకులు, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.