BREAKING
గీతా మందిరం వద్ద అఖండ అన్నసమారాధన వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ ఎన్నికలంటేనే గొడ్డలి పార్టీకి గుబులు.. ఏకగ్రీవంగా తీర్మానించిన వీర మహిళలు - మేయర్ అభ్యర్థి జయశ్రీకి మహిళా లోకం జై భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ శోభాయాత్ర మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి "ఉప్పాడ" వ్యూహం! * రాజకీయ చతురతకు నిదర్శనం * ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం భారీ ఆస్తి నష్టం తొలి రోజు ఇంకొల్లు మండలంలో 18 నామినేషన్లు మండలంలో భక్తిశ్రద్ధలతో దసరా వేడుకలు రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే సర్వశుభాలు పాల్వంచ మమత విజయ్ గౌడ్ దంపతులు రాజరాజేశ్వరిగా కామాక్షిదేవికి పూజలు ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు తరలిరావాలి నెల్లూరు ప్రగతి ప్రస్థానం ఆగకూడదు.. షరణి పొంగూరు రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలి*

Select Suryaa Now
జడ్పీటీసీ,  ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా  రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలి*

 

*జడ్పీటీసీ,  ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా  రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలి*

*అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి*

*జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్*

కర్నూలు, అక్టోబర్ 21:జడ్పీటీసీ,  ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా  రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కాగా అమలు  చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పేర్కొన్నారు.

బుధవారం  కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను,  కర్నూలు మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను  భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...నామినేషన్ ఫారాల స్వీకరణ, వాటికి జతచేయాల్సిన ధ్రువపత్రాలు, అభ్యర్థులు సమర్పించిన వివరాలు, ప్రతిపాదకుల వివరాలు, సంతకాలు, అవసరమైన ధృవీకరణ పత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ పత్రాల్లో అభ్యర్థులు పేర్కొన్న వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయడంతో పాటు, సంబంధిత రిటర్నింగ్ అధికారులు నిర్దేశించిన విధానాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. నామినేషన్ పత్రాల పరిశీలన (స్క్రూటినీ)కు అవసరమైన ఫారాలు, నమూనాలు, అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నామినేషన్లకు సంబంధించిన తేదీలు, సమయాలు, రికార్డుల నిర్వహణలో స్పష్టత ఉండాలని, ప్రతి దశలో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ల స్వీకరణ, సంబంధిత రికార్డుల నిర్వహణ, నామినేషన్ పత్రాలపై అవసరమైన సంతకాలు, గెజిటెడ్ అధికారి ధృవీకరణ, ప్రతిపాదకుల వివరాల నమోదు తదితర అంశాల్లో నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. దరఖాస్తుల్లో అవసరమైన అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి తదుపరి ఎన్నికల ప్రక్రియల వరకు ప్రతి అంశాన్ని నిబంధనల మేరకు నిర్వహించాలని, అభ్యర్థులకు అవసరమైన మార్గదర్శకాలు అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 

 

ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.