జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సోమవారం ఆత్మకూరు నియోజకవర్గం లోని మూడు మండలాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన కార్యాలయం ప్రతినిధులు పేర్కొన్నారు. నవంబర్ 2వతేదీ సోమవారం ఆయన సంగం, చేజర్ల, అనంతసాగరం మండలాల్లో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి మూడు మండలాల్లో పర్యటించి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సోమవారంఉదయం 9:00 గంటలకు సంగం మండల కేంద్రం,మధ్యాహ్నం 1:00 గంటకు చేజర్ల మండల కేంద్రం, సాయంత్రం 3:00 గంటలకు అనంతసాగరం మండల కేంద్రంలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి స్థానిక జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి పాల్గొంటారు.కావున ఆయా మండలాల తెలుగుదేశం పార్టీ,ఎన్డీయే కూటమి నాయకులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై మంత్రి పర్యటన కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు.