ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన
ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం ఉదయం సూర్యోపాసన సేవను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. లోకకల్యాణం, భక్తుల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అరుణ పారాయణం, మహాసౌర పారాయణం, సూర్య అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ సూర్యభగవానుడికి ప్రత్యేక అర్చనలు చేశారు. సూర్యోపాసన వల్ల ఆరోగ్యం, తేజస్సు, మానసిక ప్రశాంతత లభిస్తాయని పండితులు తెలిపారు. ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు కావడంతో ఈ సేవకు విశేష ప్రాధాన్యత ఉందన్నారు. అనంతరం కనకదుర్గమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చక బృందం, వేద పండితులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.