హార్టికల్చర్ హబ్ కు సంఘీభావంగా పులివెందులలో భారీ ట్రాక్టర్ ర్యాలీ
*హార్టికల్చర్ హబ్‌కు సంఘీభావంగా పులివెందులలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ*
పులివెందుల మేజర్ న్యూస్:
*రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన రంగానికి కొత్త దిశానిర్దేశం చేసే ‘రాయలసీమ హార్టికల్చర్ హబ్’ శంకుస్థాపన కార్యక్రమం అక్టోబర్ 2న మదనపల్లెలో జరగనున్న నేపథ్యంలో, ఆ కార్యక్రమానికి సంఘీభావంగా పులివెందులలో బుధవారం భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.*
పులివెందుల టీడీపీ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వందలాది మంది రైతులు ట్రాక్టర్లతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, కడప జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత , కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా, వందలాది ట్రాక్టర్లు వరుసగా కదిలాయి. పులివెందుల టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పార్నపల్లె రింగ్ రోడ్డు – పూల అంగళ్లు – పడగొట్టిన బస్టాండ్ మీదుగా మినీ సెక్రటేరియట్ వరకు కొనసాగింది.
రైతుల ప్రయోజనాలకు, ఉద్యాన పంటల అభివృద్ధికి, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాల విస్తరణకు ‘రాయలసీమ హార్టికల్చర్ హబ్’ కీలకంగా నిలుస్తుందనే ఆకాంక్షతో రైతులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు....