BREAKING
ప్రభాస్ అభిమానులకు నిరాశ: డిసెంబర్ 3కి వాయిదా పడిన 'ఫౌజీ' సినిమా విడుదల! టాలీవుడ్‌లో కొత్త సంచలనం: దర్శకుడిగా మారుతున్న 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ! *వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ మిర్యాలగూడ, మేజర్ న్యూస్: మిర్యాలగూడనియోజకవర్గం మాడ్గులపల్లి మండలం ఇసుకబావి గూడెంలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య - సునీత దంపతుల ఆధ్వర్యంలో తాడిగడప, ఉయ్యూరులో వైసీపీ గెలిస్తే రాజీనామా చేస్తా: బోడే ప్రసాద్ నేడు వైకాపా నీటి పోరు..! శభాష్ జీవీఎంసీ! అక్రమ ‘యమలోకం’ పీటలు కదిలించిన అధికారులు అక్టోబర్ 20 నుంచి అమల్లోకి భారత్-న్యూజిలాండ్ చారిత్రాత్మక FTA ఒప్పందం ఆసియా క్రీడల్లో బోణీ కొట్టిన భారత మహిళల కబడ్డీ జట్టు ద్రవ్య లభ్యత నిర్వహణలో భాగంగా OMO ద్వారా రూ. 25,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించిన RBI ఆయుర్వేద దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా 9,700కు పైగా కార్యక్రమాలు సోవా-రిగ్పా ఫార్మకోపియా అభివృద్ధికి శ్రీకారం పేద దేశాల కోసం రుణ చట్రంలో మార్పులు చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు అంతర్-రాష్ట్ర మండలి ఉత్తర్వు 1990కి సవరణ రూఫ్‌టాప్ సోలార్ కోసం 'ఢిల్లీ పీఎం సూర్య ఘర్' పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం రేఖా గుప్తా

గురజాడ.. సామాజిక మార్పున‌కు స్ఫూర్తిజాడ..

Select Suryaa Now
గురజాడ.. సామాజిక మార్పున‌కు స్ఫూర్తిజాడ..

తెలుగు సాహిత్యానికి ఆధునిక దిశను చూపిన మహనీయుడు

జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌

విజ‌య‌వాడ‌సెప్టెంబ‌ర్ 21మేజర్ న్యూస్ : తెలుగు సాహిత్యాన్ని సుసంప‌న్నం చేసి ప్ర‌జ‌ల‌కు ఆధునిక దిశను చూపడంతో పాటుతన రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని రగిలించిన మహనీయుడు గురజాడ అప్పారావు అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గురజాడ రచనలు సమాజంలోని అసమానతలుమూఢనమ్మకాలుసామాజిక రుగ్మతలపై ఆలోచింపజేసి మార్పు వైపు నడిపించాయని పేర్కొన్నారు. న‌వ‌యుగ వైతాళికుడు గుర‌జాడ అప్పారావు జ‌యంతి సంద‌ర్భంగా సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌అధికారుల‌తో క‌లిసి  గుర‌జాడ చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ గుర‌జాడ రచనలు సామాజిక అసమానతలుమూఢనమ్మకాల‌పై ఆలోచన రేకెత్తిస్తూ ప్రజల్లో మార్పు కోసం స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అనే గురజాడ సందేశం దేశంసమాజం పట్ల ప్రతిఒక్కరికీ ఉన్న బాధ్యతను గుర్తుచేస్తోందన్నారు. గురజాడ సాహిత్య స్ఫూర్తితో యువత మానవతా విలువలుసామాజిక బాధ్యతసమాజ అభ్యున్నతి పట్ల నిబద్ధతను పెంపొందించుకోవాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహంవివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.