గుండ్లకొండ టిడిపి సర్పంచ్ అభ్యర్థి గా లక్ష్మీదేవి
దేవనకొండ మండల ఫరిదిలోని గుండ్లకొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా టిడిపి సీనియర్ నాయకులు ఈడిగ రామదాసు గౌడ్ సతీమణి లక్ష్మీదేవి సోమవారం గుండ్లకొండ గ్రామంలో నామినేషన్ వేశారు.ఈ సందర్భంగా రామదాలు గౌడ్ మాట్లాడుతూ గుండ్లకొండ గ్రామం అభివృద్ధిలో వెనుకబడి వుందని గ్రామ సర్పంచ్ గా తమ కుటుంబానికి ఒక్క అవకాశం కల్పిస్తే వైకుంఠం దంపతుల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.