గ్రంథాలయ 59వ జాతీయ వారోత్సవాలు
నాదెండ్ల న్యూస్ : మండల కేంద్రమైన నాదెండ్ల శాఖ గ్రంథాలయంలో ఈనెల 14వ తేదీ నుండి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ అధికారి సుబ్బారావు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజైనా ఆదివారం పాఠశాల విద్యార్థులకు పుస్తక ప్రదర్శన నిర్వహించారు ప్రదర్శనలో వివిధ రకాల పుస్తకాలు జాతీయ నాయకుల జీవిత చరిత్రలు, వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు నవలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు సవి వివరంగా వివరించామన్నారు. విద్యార్థుల క్రమం తప్పకుండా గ్రంథాలయం కొచ్చి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి పుస్తక పఠనం చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులతో పాటు మహిళలు కూడా తీరిక సమయంలో గ్రంథాలయానికి వచ్చి మంచి మంచి పుస్తకాలు తీసుకుపోయి పుస్తక పఠనం చేయాలి అన్నారు. వృద్ధులు, వృద్ధ మహిళలు కూడా ఖాళీగా ఉన్న సమయంలో పుస్తక పఠనం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.