BREAKING
ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వద్దు గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా.. గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా.. ప్రతి రైతుకు డిజిటల్ గుర్తింపు.. వ్యవసాయ సేవలకు సరికొత్త భరోసా. ఇండస్ట్రీయల్ ప్రాజెక్ట్ పై వర్క్ షాప్ ఆదివాసీ మహిళకు అగ్రతాంబూలం ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులు క్లియర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి పాలనలోనే ..:ఎమ్మెల్యే బండారు ఎంపీటీసీ రాజ్ కుమార్‌కు ఘన సన్మానం ఆ ఆరోపణలు అవాస్తవం... విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధిపై నారా లోకేష్, రానా దగ్గుబాటి కీలక చర్చ.. సీఐఐ సదస్సులో ఆసక్తికర దృశ్యం! రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు కొత్త రేవుపోలవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! ఏటికొప్పాక కళాకృతుల స్టాల్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు తదితరులు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు హనుమాన్ సర్కిల్‌లో 30 కేజీల భారీ కేక్ కటింగ్ 2 వేల మంది పేదలకు అన్నదానం

Select Suryaa Now
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు హనుమాన్ సర్కిల్‌లో 30 కేజీల భారీ కేక్ కటింగ్ 2 వేల మంది పేదలకు అన్నదానం

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి 85వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కొత్తపల్లి పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ పేట వెంకటరమణ, ఉప్పలబట్టి రమణ ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ సర్కిల్‌లో భారీ స్థాయిలో జన్మదిన వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 30 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. జన్మదిన వేడుకల్లో భాగంగా సుమారు 2 వేల మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం చేపట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి, నంద్యాల భార్గవ రెడ్డి, టీడీపీ పార్లమెంటరీ కార్యదర్శి వై.ఎస్. జబీవుల్లా, బద్వేలు శ్రీనివాసుల రెడ్డి, సీతంపల్లి చంద్ర అడ్వకేట్, బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డితో పాటు నూతన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి 85వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో హనుమాన్ సర్కిల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు.