BREAKING
టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేతవరంలో పోలీసుల అవగాహన సదస్సు 2 లోగా దీపావళి బాణసంచా షాపులకు దరఖాస్తులు చేసుకోవాలి జాతీయ సరస్ మేళాలో వైద్య శిబిరాలు, ఐసీయూ విభాగం పరిశీలన పురపాలక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి : కమిషనర్ ధ్యానచంద్ర హోల్డింగ్ ఏరియాల్లో భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం

గౌడ సంఘం నేత చెంచు రామారావు జన్మదినం సందర్భంగా అన్నదానం, పండ్ల పంపిణీ

Select Suryaa Now
గౌడ సంఘం నేత చెంచు రామారావు జన్మదినం సందర్భంగా అన్నదానం, పండ్ల పంపిణీ

కైకలూరు, మేజర్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పోసిన చెంచు రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని కైకలూరు నియోజకవర్గ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, ఆసుపత్రికి వచ్చిన గర్భిణులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. అనంతరం కైకలూరు ఎస్టీ కాలనీలో పేదలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.అదేవిధంగా లోకుమూడి దత్తాశ్రమంలో పోసిన చెంచు రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం నాయకులు పరసా వీర్రాజు, కైకలూరు నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు పోలగాని నాగరాజు మాట్లాడుతూ, చెంచు రామారావు జన్మదినం సందర్భంగా అన్నదానం, పండ్లు, రొట్టెల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. పేదలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలిదిండి సెంటర్లో బదిర్రాజు కాంప్లెక్స్ గ్రౌండ్లో  ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు . నియోజకవర్గం లోని పలువురు నాయకులు రామారావుకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మాడెం కృష్ణారావు, అల్లూరి మంగారావు,బొర్రా సత్యనారాయణ,పరిసే రాణి, సింహాద్రి కేదార్, వీరంకి సత్యనారాయణ,దాసరి శ్రీనివాస్, చిల్లి ముంత నాగబాబు తదితరులు పాల్గొన్నారు.