BREAKING
నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం -బంగారు ఆభరణాలు దొంగలించిన యువకుడి అరెస్ట్ -కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి బడంగ్‌పేట్‌లో బహుళ అంతస్తుల భవనాల సెల్లర్, మూడు షెడ్లకు సీజ్" అల్మాస్‌గూడ–గుర్రంగూడ రహదారికి మహర్దశ..!* *అభివృద్ధి పను లకు సబితమ్మ శ్రీకారం..! ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ దూకుడు..!* గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం

ఎవరిది గెలుపు? మరి ఎవరిది ఓటమి?

Select Suryaa Now
ఎవరిది గెలుపు? మరి ఎవరిది ఓటమి?
పెదకాకాని న్యూస్: పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండల  గురువారం జరిగిన స్థానిక ఎన్నికల పోలింగ్ లో అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ సరళి దేనికి సంకేతమో? అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ లో పెద్ద ఎత్తున మహిళలు, యువత, వృద్ధులు సైతం పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరిగిన ఓట్ల శాతం ఎవరి ఖాతాలో జమ అయిందో తేలాల్సి ఉంది.  అధికార పక్షం రెండున్నర ఏళ్ల అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రధాన ఏజెండాగా తీసుకొని స్థానిక ఎన్నికల్లో ప్రజలకు వివరించడంలో సఫలీకృతులయ్యారు. కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధిని సంక్షేమాన్ని నిరాటకంగా కొనసాగిస్తామని ప్రజలకు వివరించారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే తిరిగి ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని రుచి చూపిస్తామని హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓటరు ఎవరికి ప్రభావితం అయ్యారో తెలియదు. కానీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం పోటెత్తారు.  బ్యాలెట్ బాక్స్ లో తమ అభిప్రాయాన్ని  పరోక్షంగా నిక్షిప్తం చేశారు.
గ్రామాల వారీగా ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు ఇలా ఉన్నాయి.....
పెదకాకాని మండలంలో మొత్తం ఓట్లు 65835, అందులో పోలైన ఓట్లు 48540. కొప్పురావూరు మొత్తం ఓట్లు 4126 అందులో పోలైనవి 3501, వెనిగండ్ల మొత్తం ఓట్లు 6989 పోలైనవి 5158, అగతవరప్పాడు మొత్తం ఓట్లు1998 అందులో పోలైనవి 1468, నంబూరు మొత్తం ఓట్లు 15097, అందులో పోలైనవి 11306, పెదకాకాని మొత్తం ఓట్లు 21547 అందులో పోలైనవి 14970,  గోళ్ళమూడి 508 అందులో పోలైనవి 418,. తక్కెళ్ళపాడు మొత్తం ఓట్లు 7047 అందులో పోలైనవి 4929. రామచంద్రాయపాలెం మొత్తం ఓట్లు 360 అందులో పోలైనవి 315. ఉప్పలపాడులో మొత్తం ఓట్లు 4831 అందులో పోలైనవి 3359. వెంకట కృష్ణాపురం మొత్తం ఓట్లు 1870 అందులో పోలైనవి 1549. తంగెళ్ళమూడి మొత్తం ఓట్లు 619 అందులో పోలైనవి 554. అనుమర్లపూడి మొత్తం ఓట్లు1223 అందులో పోలైనవి1008గా ఉన్నాయి.
అభివృద్ధికి పట్టం, గెలుపు పై ధీమా...
తాము అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరంలోని కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని పరుగు పెట్టించామని, అందుకే పుర ప్రజలు తమకు మద్దతు పలికారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి గెలుపు ఏకపక్షమేనని, ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికే పట్టం కట్టారని అధికారపక్షం ధీమా వ్యక్తం చేస్తుంది.
ప్రజాభిమానంపై ధీమా...
గత ప్రభుత్వ హయాంలో తాము నేరుగా లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాల ఫలాలే తమను స్థానిక సంస్థల్లో గెలిపిస్తాయని కాకాని ఓటర్లు చైతన్యవంతులని ఎవరికి పట్టం కట్టాలో వారి ఆలోచనలు వారికి ఉన్నాయని ప్రతిపక్షం పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయత ఓట్ల రూపంలో కనబడిందని ప్రతిపక్షం ధీమా వ్యక్తం చేస్తుంది.