ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం
వింజమూరు, మేజర్ న్యూస్ : రాష్ట్రంలో త్వరలో జరగనున్న జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం స్థానిక వై ఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఎంపీడీవో కే శ్రీనివాసరెడ్డి తాసిల్దార్ స్వర్ణ ఎంఈఓ ఎం వెంకటేశ్వర్లు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మాస్టర్ ట్రేనిలు వివి చలమయ్య పి కొండారెడ్డి లు శిక్షణ అంశాలను కూలంకషంగా తెలియజేశారు. పి ఓ ఏపివోలు యొక్క విధులు నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఎన్నికల నిర్వహణ విధానం సామాగ్రిని అందుకోవడం పోలింగ్ బూతుల నిర్వహణ పోలింగ్ విధానము ఓటింగ్ నిబంధనలు బ్యాలెట్ బాక్స్ నిర్వహణ అలాగే బ్యాలెట్ బాక్స్ ఇతర సామాగ్రి అందజేసే విధానము అందుకు అవసరమైన కవర్లు వారంలో తదితర విషయాలను గురించి తెలియజేశారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా ఉండాలని సిబ్బంది చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో కే రామారావు మండల పరిషత్ సిబ్బంది పీవోలు ఏపీవోలు ఉన్నారు.