BREAKING
​ప్రశాంత వాతావరణంలో చైర్‌పర్సన్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన ఇల్లందు రామ్‌దేవ్ బాబా మందిరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు పాలకొండ లో ఉచిత ఆయుష్ వైద్య శిబిరం * జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డా. హేమాక్షి * చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశం* ఆత్మీయ మిత్రుడు రోకటి ఇంటికి మంత్రి తుమ్మల చేతుల మీదుగా..‘ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల’కు భూమిపూజ - రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో. ​స్వర్గీయ సరోజిని ముఖర్జీ ఆదరణ కూడికకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి బాధిత కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం పదో తరగతిలో 555 మార్కులు-గోపా ప్రతిభా పురస్కారం.- అంబాల మణికంఠ సాయికి ఘన సన్మానం. ఎంపీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల వచ్చే విజయదశమి నాటికి జూలూరుపాడు టన్నెల్‌ పూర్తి చేయాలి -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శి లో వైసీపీ నామినేషన్ తిరస్కరణ. వైసీపీ అభ్యర్థులు వీరే పూలను పూజించే గొప్ప వేడుక బతుకమ్మ పండుగ : నందికంటి శ్రీధర్ 'పీఠ'ముడి వీడుతున్నట్టేనా! *కొలిక్కివస్తున్న 'సర్దుబాటు' చర్చలు..

ఎన్నికల రద్దుతో ప్రజాస్వామ్యానికి ఊపిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

Select Suryaa Now
ఎన్నికల రద్దుతో ప్రజాస్వామ్యానికి ఊపిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

మైదుకూరు మేజర్ న్యూస్: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించిన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అభినందించారు. సోమవారం మైదుకూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మైదుకూరులో నామినేషన్ల సందర్భంగా అన్యాయాలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను చించివేసినా పోలీసులు అడ్డుకోలేదని విమర్శించారు. కొందరు అభ్యర్థులను బలవంతంగా బయటకు పంపించారని, మహిళా అభ్యర్థి పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారని అన్నారు.అధికారుల అండతో ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని పేర్కొన్నారు. ప్రజల ఓటుతోనే నాయకులు గెలవాలని, అధికార యంత్రాంగం ద్వారా ఫలితాలను ప్రభావితం చేసే పరిస్థితి రాకూడదన్నారు.మైదుకూరుతో పాటు కడప, జమ్మలమడుగు, కమలాపురం, బద్వేల్లోనూ నామినేషన్ల సందర్భంగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల సంఘం నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందని, మళ్లీ జరిగే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రఘురామిరెడ్డి కోరారు.

రిపోర్టర్: బోర్రా శివరామిరెడ్డి, మైదుకూరు ఇంచార్జ్, కడప జిల్లా