BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

ఎనిమిది పంచాయతీల్లో వైసిపి పార్టీ పదవులకు నాయకులు కార్యకర్తలు రాజీనామాలు

Select Suryaa Now
ఎనిమిది పంచాయతీల్లో వైసిపి పార్టీ పదవులకు నాయకులు కార్యకర్తలు రాజీనామాలు

తె ర్లాం, సూర్య: తెర్లాం మండలంలో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ గట్టిగా తగిలిందనే చెప్పాలి .సుమారు వెయ్యి మందికి పైగా పదవులకు పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. గురువారం వెలగవలస గ్రామంలో రైస్ మిల్ ఆవరణలో పత్రికా విలేకరుల సమావేశం మాజీ వైస్ ఎంపీపీ చేపేన సత్యనారాయణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలంలో 8 పంచాయతీలకు సంబంధించి మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మండల మాజీ వైస్ ఎంపీపీ చేపిన సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు వైఎస్ఆర్ పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ( చిన్న  శ్రీను) వైఎస్ఆర్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన పరిస్థితిలో తామంతా వైఎస్ఆర్ పార్టీని వీడి పోవాలని అతనితోనే తమ పయనం కొనసాగుతుందని మజ్జి శ్రీనివాసరావు నాయకత్వం మాకందరికీ ఇష్టమని వారు అన్నారు. వారి అడుగుజాడల్లో తామంతా నడవాలని అతను వెన్నంటు ఉండి సేవలు అందించాలని నిర్ణయించుకున్నట్టు వారంతా ప్రకటించారు .చీపురుపల్లి మండల మాజీ జడ్పిటిసి వలి రెడ్డి శ్రీనివాసు నాయుడు కోట్ల వెంకట్రావు బూర్లే  నరేష్ సమక్షంలో తమ రాజీనామా పత్రాలను సమర్పించి వైసిపిని వీడుతున్నట్టు బహిరంగంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రంగప్ప వలస మాజీ సర్పంచ్ రాంబాబు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి సంబంధించి కొంతమంది అదేవిధంగా ఎమ్మార్ అగ్రహారం మాజీ సర్పంచ్ ప్రతినిధి పి గోపి ఆధ్వర్యంలో కొంతమంది పనుకు వలస  మాజీ సర్పంచ్ చందక సత్యనారాయణ ఆధ్వర్యంలో మరి కొంతమంది అదే విధంగా  వెలగవలస గ్రామ మాజీ సర్పంచ్ చేపెన ఫల్గుణి  రావు వారి  అనుచర గణం పెరుమాలి కుచర్ల పాటు భద్రరాజు పి. శివాజీ నేతత్వంలో మరి కొంతమంది అదే విధంగా వి. చిన్నయ్య పేట ఎంపీటీసీ ప్రతినిధి చింత అప్పారావు తన అనుచరరులతో అలాగే అంట్లవార లింగాపురం మాజీ సర్పంచ్  బూరాడ తవిటి నాయుడువారి అనుచరులు  పలు గ్రామాల వైసిపి నాయకులు కార్యకర్తలు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు వారు ప్రకటించారు.