ఎంపీటీసీ రిజర్వేషన్లలో ఎస్టీలకు అన్యాయం -- సిపిఎం నేత పెద్దిరాజు
నర్సాపురం రూరల్, మేజర్ న్యూస్ :మండలంలో ఎంపీటీసీల రిజర్వేషన్ల కేటాయింపులో ఎస్టీలకు స్థానం కల్పించకపోవడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు విమర్శించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
మండలంలోని కొత్త నవరసపురం, సీతారాంపురం, రుస్తుంబాద, చిట్టవరం గ్రామాల్లో ఎస్టీలు నివాసం ఉంటున్నారని, అయితే నరసాపురం మండలంలోని 23 ఎంపీటీసీ స్థానాల్లో ఒక ఎంపీటీసీ స్థానాన్ని కూడా ఎస్టీలకు కేటాయించకుండా వారికి అన్యాయం చేశారని అన్నారు.నరసాపురం మున్సిపాలిటీ రిజర్వేషన్లలో ఎస్టీలకు ఒక స్థానం కేటాయించారని, అదే మాదిరిగా మండలంలో కూడా ఒక ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పెద్దిరాజు విజ్ఞప్తి చేశారు.